Kamareddy Mistery Deaths: అసలు వివరాల్లోకి వెళితే బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తోన్న శృతి, సహకారం సంఘం ఆపరేటర్‌గా పనిచేస్తోన్న నిఖిల్ అనే యువకుడి అదృశ్యం ఒకేసారి జరిగింది.దీంతో బీబీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అంతేకాదు అక్కడే ఎల్లారెడ్డి చెరువు వద్ద వారి వస్తువులు కనిపించాయి. వీరితోపాటు ఎస్సై సాయి కుమార్ కారు కూడా అక్కడే ఉంది. దీంతో గాలించగా మృతదేహాలు ఆ చెరువులోనే లభించాయి.
వివరాల్లోకి వెళితే స్టేషన్ బీబీపేట ఠాణాలో పనిచేస్తోన్న శృతి రాత్రి ఇంటికి వెళ్లకపోయే సరికి ఆమె తల్లిదండ్రులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఎస్సై సాయి కుమార్ ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ అయింది. దీంతో ఈ ఇద్దరికీ ఏమైందని అధికారులు హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, చివరగా శృతి ఫోన్ సిగ్నల్స్ ఎల్లారెడ్డి చెరువు వద్ద లభించింది.దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వెతకగా అక్కడే కానిస్టేబుల్‌తోపాటు సహకార సంఘం ఆపరేటర్‌గా పనిచేస్తోన్న నిఖిల్ ఫోన్ కూడా అక్కడే ఉంది. ఇది కాకుండా వీరితోపాటు ఎస్సై సాయి కుమార్ కారు కూడా అక్కడే కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసు అధికారులు గజ ఈతగాళ్లు, రిస్క్యూ టీమ్ సిబ్బందితో కలిసి ఆ చెరువులో రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అర్ధరాత్రి గడిచిన తర్వాత కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఇదీ చదవండి: జ్యోత్స్స వీపు వాయించడానికి చీపురు తిరగేసిన దీప.. ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెస్తా అని ఊరెళ్లిపోయిన అనసూయ..
గాలింపు చర్యలు కొనసాగుతూ ఈరోజు ఉదయం ఎస్సై సాయి కుమార్ మృతదేహం కూడా అదే చెరువలో దొరికింది. అయితే, గతంలో ఎస్సై సాయి కుమార్ కూడా బీబీపేట ఠాణాలోనే పనిచేశారు ఆ తర్వాత వేరే స్టేషన్‌కు బదిలీ అయ్యారు. అక్కడే శృతి కూడా పనిచేసింది. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. శృతికి అప్పటికే పెళ్లాయి విడాకులు కూడా తీసుకుంది. ఎస్సై సాయి కుమార్‌కు భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత సాయి కుమార్ వేరే స్టేషన్‌కు బదిలీ అయ్యారు. అయితే, ఎస్సై, కానిస్టేబుల్ మధ్య ఆపరేటర్ నిఖిల్ కూడా మధ్యవర్తిత్వం వహించాడు. దీంతో వీరు మాట్లాడాటానికి ఆ చెరువు వద్దకు వెళ్లి ఉండొచ్చు. అక్కడ మాటా మాటా పెరిగి శృతి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేందుకు చెరువులో దూకి ఉండొచ్చు. ఆమెను రక్షించే క్రమంలో మిగతా ఇద్దరూ కూడా దూకి ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో అసలు ఈ ముగ్గురు ఆ చెరువు వద్దకు ఎందుకు వెళ్లారు. మిస్టరీ ఏంటి? వీరిని ఎవరైనా చంపారా? లేదా వారే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. రాత్రి ఇద్దరి డెడ్ బాడీలో బయటకు రావడంతో ఎస్సై పరారీ అయ్యాడేమో అనుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.